NHPC 2025 Notification భారతదేశంలో అతిపెద్ద హైడ్రోపవర్ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ (NHPC Limited) కొత్తగా నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సహాయక రాజభాష అధికారి, జూనియర్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్), ఐటీ సూపర్ వైజర్, సీనియర్ అకౌంటెంట్, హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 248 ఖాళీలు ఉన్నాయి. ఎన్‌హెచ్‌పీసీ ఉద్యోగాల్లో జీతాలు, అలవెన్సులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Also Read : CCRAS Recruitment 2025 – Group A, B, C Posts – Apply Online | ఆయూష్ మంత్రిత్వ శాఖలో భారీ ఖాళీలు
NHPC 2025 Notification Overview
అంశం | వివరాలు |
సంస్థ | NHPC లిమిటెడ్ |
పోస్టులు | నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు |
మొత్తం ఖాళీలు | 248 |
వేతనం | ₹27,000 – ₹1,40,000/- (పోస్ట్‌ను బట్టి) |
దరఖాస్తు ప్రారంభం | 02.09.2025 |
దరఖాస్తు చివరి తేదీ | 01.10.2025 |
ఎంపిక విధానం | కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) + పత్రాల పరిశీలన |
అధికారిక వెబ్‌సైట్ | www.nhpcindia.com |
ఖాళీల వివరాలు
NHPC 2025 Notification హైడ్రోపవర్ సంస్థ అయిన NHPC లిమిటెడ్ నుంచి భారీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 248 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
పోస్టు పేరు | ఖాళీలు |
సహాయక రాజభాష అధికారి | 11 |
జూనియర్ ఇంజనీర్ (సివిల్) | 109 |
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) | 46 |
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) | 49 |
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) | 17 |
పర్యవేక్షకుడు (ఐటీ) | 1 |
సీనియర్ అకౌంటెంట్ | 10 |
హిందీ అనువాదకుడు | 5 |
మొత్తం | 248 |
అర్హతలు
NHPC 2025 Notification పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- సహాయక రాజభాష అధికారి : హిందీలో మాస్టర్స్, డిగ్రీ స్థాయిలో ఇంగ్లీష్ తప్పనిసరి + 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
- జూనియర్ ఇంజనీర్ (సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్) : సంబంధిత విభాగంలో డిప్లొమా (General/OBC/EWS కోసం కనీసం 60% మార్కులు ఉండాలి. SC/ST/PwBD కోసం 50% మార్కులు ఉంటే సరిపోతుంది.
- పర్యవేక్షకుడు (ఐటీ) : BCA / బి.ఎస్‌సి (కంప్యూటర్ సైన్స్/ఐటీ) లేదా డిప్లొమా లేదా DOEACC ‘A’ లెవెల్ కోర్సు.
- సీనియర్ అకౌంటెంట్ : ఇంటర్ CA లేదా ఇంటర్ CMA పాసై ఉండాలి.
- హిందీ ట్రాన్స్ లేటర్ : హిందీ లేదా ఇంగ్లీష్‌లో మాస్టర్స్ + 1 సంవత్సరం అనుభవం (అనువాదం/టర్మినాలజీ/బోధన).
Also Read : Oil India Grade A, B & C Recruitment 2025 | ఆయిల్ ఇండియాలో గ్రేడ్ A, B & C ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
వయో పరిమితి :
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
- వయోసడలింపు:
- SC/ST : 5 సంవత్సరాలు
- OBC : 3 సంవత్సరాలు
- PwBD : 10 నుండి 15 సంవత్సరాలు
- SC/ST : 5 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు:
NHPC 2025 Notification అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General / OBC / EWS : ₹708
- SC/ST/PwBD/Ex-Servicemen/మహిళలు : ఫీజు లేదు
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) – 200 మార్కులు
- అర్హత మార్కులు:
- General/OBC/EWS → 40%
- SC/ST/PwBD → 35%
- General/OBC/EWS → 40%
- CBTలో ఉత్తీర్ణులైనవారికి పత్రాల పరిశీలన (డాక్యుమెంట్ వెరిఫికేషన్) ఉంటుంది.
జీతం వివరాలు :
- సహాయక రాజభాష అధికారి : ₹40,000 – ₹1,40,000
- జూనియర్ ఇంజనీర్/పర్యవేక్షకుడు/సీనియర్ అకౌంటెంట్ : ₹29,600 – ₹1,19,500
- హిందీ ట్రాన్స్ లేటర్ : ₹27,000 – ₹1,05,000
- అదనంగా HRA, DA, మెడికల్, PF, పెన్షన్, గ్రాట్యుటీ, PRP లభిస్తాయి.

Also Read : DRDO DIBT Fellowship 2025 | DRDO ఫెలోషిప్ నోటిఫికేషన్
దరఖాస్తు విధానం
NHPC 2025 Notification అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.nhpcindia.com లోకి వెళ్లాలి.
- “Career” విభాగంలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
- అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో మరియు సంతకం స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత Application ID ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 02 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 01 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |