AP Grama Sachivalayam Notification 2025 : ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు సచివాలయాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించే కీలక కేంద్రాలు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 28 ఆగస్టు 2025న విడుదలైన G.O.Ms.No.10 ప్రకారం, GSWS (Grama & Ward Sachivalayam Services) కొత్త 3-టియర్ నిర్మాణం ప్రవేశపెట్టింది. దీని ద్వారా జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో సమన్వయం, పర్యవేక్షణ, సర్వీస్ డెలివరీ మరింత సమర్థవంతంగా జరుగనుంది. ఈ కొత్త వ్యవస్థలో ప్రభుత్వం మొత్తం 2,778 కొత్త పోస్టులను ఆమోదించింది. వీటిలో1,785 పోస్టులు ఇప్పటికే ఉన్న సచివాలయ ఉద్యోగులకు డిప్యుటేషన్ ద్వారా భర్తీ చేయనుంది. మరో 993 కొత్త పోస్టులను పత్యేకంగా సృష్టించింది.

AP Grama Sachivalayam Notification 2025 Overview
| అంశం | వివరాలు |
| సంస్థ | Grama & Ward Sachivalayam (GSWS) |
| నోటిఫికేషన్ | AP Grama Sachivalayam Notification 2025 |
| పోస్టుల మొత్తం సంఖ్య | 2,778 |
| నియామకం | Deputation / Outsourcing |
| విభజన | జిల్లా, మండల, ULB స్థాయిల్లో |
| ఆదేశాలు | G.O.Ms.No.10, Dt.28-08-2025 |
Also Read : IBPS RRB Office Assistant Recruitment 2025 | గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
ఏపీ గ్రామ/వార్డు సచివాలయాల్లో 2,778 పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 1,785 పోస్టులు ఇప్పటికే ఉన్న సిబ్బందిని రిడెప్లాయ్మెంట్ ద్వారా 993 పోస్టులు కొత్తగా సృష్టించారు. ఈ నియామకాలు నియామకాలు PR&RD, MA&UD మరియు ఇతర శాఖల నుండి Deputation/Outsourcing ద్వారా జరుగుతాయి.
మొత్తం పోస్టుల విభజన
- జిల్లా స్థాయి పోస్టులు – 260
- మండల స్థాయి పోస్టులు – 1,980
- పట్టణ (ULBs) పోస్టులు – 535
- మొత్తం: 2,778 పోస్టులు
పోస్టుల కేటాయింపు
జిల్లా స్థాయి:
- District GSWS Officer
- Superintendent
- Senior Assistant
- Junior Assistant / Functional Assistant
- Technical Coordinator
- Office Subordinate
మండల స్థాయి:
- Mandal GSWS Officer
- Junior Assistants / Functional Assistants
పట్టణ స్థాయి (ULBs):
- Additional Commissioners
- Zonal Coordinators
- Managers
- Junior & Senior Assistants
- Technical Coordinators
Also Read : AP Inter Public Exams 2025-26 : ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు | కీలక మార్పులు, కొత్త విధానం
ఎంపిక ప్రక్రియ:
- 1,785 పోస్టులు : ఇప్పటికే ఉన్న సిబ్బందిని మళ్లింపు (Redeployment).
- 993 పోస్టులు : కొత్తగా సృష్టించబడినవి.
- నియామకాలు PR&RD, MA&UD మరియు ఇతర శాఖల నుండి Deputation/Outsourcing ద్వారా జరుగుతాయి.
ముఖ్యమైన విషయాలు
- ఈ పోస్టుల భర్తీ GSWS డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది.
- ఎంపికైన సిబ్బంది IT & మౌలిక సదుపాయాలతో స్థానిక స్థాయిలో సేవలను అందించాల్సి ఉంటుంది.
- జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో సచివాలయాల సమన్వయం, పర్యవేక్షణలో ఈ పోస్టులు కీలకం కానున్నాయి.
Notification : Click here
Also Read : IBPS RRB PO Recruitment 2025 | గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఆఫీసర్ పోస్టులు











