AP Work from Home Kaushalam Survey 2025: ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే.. చదువుకున్న వారికి ఉద్యోగం దొరకడం కష్టమైంది. దీంతో ఎంతో మంది నిరుద్యోగుల్లో నిరాశ పెరిగిపోతోంది.. ఈ పరిస్థితిని గమనించిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం పేరే ‘కౌశలం సర్వే’.. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపడుతుంది.
What is Kaushalam Survey?
AP Work from Home Kaushalam Survey 2025 కౌశలం సర్వే అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతపై పూర్తి సమాచారం సేకరిస్తారు. ఎవరు ఏ చదువు చేశారు, ఏ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకుంటారు. మొదట్లో దీనిని “వర్క్ ఫ్రం హోమ్ సర్వే” అని పిలిచేవారు. ప్రస్తుతం దీని పేరు ‘కౌశలం సర్వే‘గా మార్చారు.

Who is Eligible?
కౌశలం సర్వే పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత కోసం ప్రవేశపెట్టినది. రాష్ట్రానికి చెందిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, పీహెచ్‌డీ చేసిన వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాదు, 10వ తరగతి పూర్తి చేయని వారు కూడా తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చు. వయసు 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
Also Read : IB Security Assistant MT Recruitment 2025 | డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్
సర్వే ఎలా చేస్తారు?
AP Work from Home Kaushalam Survey 2025 ఈ సర్వేను గ్రామ/వార్డు సచివాలయం ద్వారా నిర్వహిస్తారు. మీరు మీ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, వయసు ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సచివాలయంలో ఉన్న సిబ్బంది మీ వివరాలను కౌశలం మొబైల్ యాప్ ద్వారా నమోదు చేస్తారు. ఆ వివరాల ఆధారంగా భవిష్యత్తులో మీకు తగిన ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి.
Kousalam Survey Self Enrollment
ప్రస్తుం కౌశలం సర్వేకి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు సచివాలయానికి వెళ్లకుండా డైరెక్ట్ అభ్యర్థులే సర్వే పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
సర్వే స్వయంగా ఎలా చేసుకోవాలి?
AP Work from Home Kaushalam Survey 2025 కింది దశలు ఫాలో అయ్యి అభ్యర్థులు సచివాలయాలకు వెళ్లకుండా స్వయంగా సర్వేలో పాల్గొనవచ్చు.
- అభ్యర్థులు https://gsws-nbm.ap.gov.in/BM/ లింక్ పై క్లిక్ చేయాలి.
- హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ‘సిటిజన్ సర్వీస్ ఆన్ లైన్ పోర్టల్’, ‘వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యుల్’ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి.
- వర్క్ ఫ్రమ్ హోమ్ మాడ్యూల్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేయాలి. అప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే సర్వే ఓపెన్ అవుతుంది.
- అందులో మొబైల్ నెంట్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది.
- తర్వాత మెయిల్ ఐడీ, చదివిన కోర్సు, సబ్జెక్టులు, కాలేజీ వివరాలు నమోదు చేయాలి.
- అలాగే మార్కుల శాతం / జీపీఏ వివరాలు ఎంటర్ చేయాలి.
- తర్వాత కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.
- అయితే 10వ తరగతి, ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
Also Read : LIC Golden Jubilee Scholarship Scheme 2025 | 60% మార్కులు ఉంటే ₹40,000 స్కాలర్‌షిప్ మీకే!
కౌశలం సర్వే ద్వారా లాభం ఏంటీ?
AP Work from Home Kaushalam Survey 2025 కౌశలం సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగ యువకుడి సమాచారం ప్రభుత్వానికి అందుతుంది. దీని ఆధారంగా ఎవరు ఏ ఉద్యోగానికి అర్హులనే దానిని స్పష్టంగా గుర్తిస్తారు. తర్వాత వారికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లోని ఉద్యోగ నోటిఫికేషన్లు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుతాయి. దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు లభిస్తాయి.
కౌశలం సర్వే లక్ష్యం
AP Work from Home Kaushalam Survey 2025 ఈ పథకం వెనక ఒకే ఒక ఉద్దేశ్యం ఉంది. అదే ఏమిటంటే—ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ ఎక్కడైనా ఖాళీలు వస్తే, సర్వేలో నమోదు చేసుకున్న అభ్యర్థులకు నోటిఫికేషన్లు పంపబడతాయి. అదేవిధంగా భవిష్యత్తులో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు కూడా అందిస్తారు.
Also Read : IIM Visakhapatnam Recruitment 2025 | అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్










