APPSC FBO & ABO Hall tickets Download 2025 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. చాలా మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టుల రాత పరీక్ష సెప్టెంబర్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. ఈక్రమంలో ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షల హాల్ టికెట్స్ ని విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో వీటి హాల్ టికెట్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

APPSC FBO & ABO Hall tickets Download 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పోస్టు పేరు | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెట్ బీట్ ఆఫీసర్ |
పోస్టుల సంఖ్య | 691 |
పరీక్ష తేదీ | 07 సెప్టెంబర్, 2025 |
అధికారిక వెబ్ సైట్ | https://portal-psc.ap.gov.in/ |
Also Read : AP Inter Public Exams 2025-26 : ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు | కీలక మార్పులు, కొత్త విధానం
APPSC FBO & ABO హాల్ టికెట్ డౌన్ లోడ్
ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో మొత్తం 691 ఫారెస్ట బీట్ ఆఫీసర్ మరయు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. పరీక్షల హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
APPSC FBO & ABO హాల్ టికెట్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షల హాల్ టికెట్లను కింది దశలను ఉపయోగించి సింపుల్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- APPSC FBO & ABO Hall tickets Download 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- యూజర్ ఐడీ మరియు పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
- APPSC FBO & ABO హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసి, దానిని ప్రింట్ తీసుకోవాలి.
Also Read : CCRAS Recruitment 2025 – Group A, B, C Posts – Apply Online | ఆయూష్ మంత్రిత్వ శాఖలో భారీ ఖాళీలు
ఏమైనా తప్పులు ఉంటే ఏం చేయాలి?
అభ్యర్థులు APPSC FBO & ABO Hall tickets Download 2025 చేసుకున్న తర్వాత హాల్ టికెట్ లో పరీక్ష కేంద్ర, సమయం, అడ్రస్, అభ్యర్థి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, గార్డియన్ నేమ్ మరియు ఇతర వివరాలు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. హాల్ టికెట్ లో పేర్కొన్న వివరాల్లో ఏదైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారికి తెలియజేయాలి.
- అభ్యర్థి పేరు
- పుట్టిన తేదీ
- అభ్యర్థి ఫొటో గ్రాఫ్
- అభ్యర్థి సంతకం
- పరీక్ష వేదిక
- పరీక్ష తేదీ మరియు సమయం
- రోల్ నెంబర్
పరీక్షల కోసం కీలక సూచనలు :
APPSC FBO & ABO Hall tickets Download 2025 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల పరీక్ష సెప్టెంబర్ 7వ తేదీన జరగనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా మార్గదర్శకాలను పాటించాలి. అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
- అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు మరియు చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ (ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్) తీసుకెళ్లాలి.
- పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోన్, స్మార్ట్ వాచ్, ఇయర్ ఫోర్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకూడదు.
- ఓఎంఆర్ షీట్ నింపేటప్పుడు సరైన మార్గదర్శకాలను పాటించండి.
- పరీక్ష హాలులో మీక కేటాయించిన సీటులో కూర్చొండి.
Also Read : APCOB Recruitment 2025 | ఏపీ Cooperative Bank లో ఉద్యోగాల భర్తీ – Official Notification Out