APSWREIS Faculty Notification 2025 ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే కోచింగ్ సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఐఐటీ, నీట్ కోర్సులకు కోచింగ్ ఇవ్వడానికి అనుభవం ఉన్న ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు జూన్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
APSWREIS Faculty Notification 2025
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే కోచింగ్ సెంటర్లలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులను బోధించేందుకు స్పెషల్ మెంటార్ లేదా ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఐఐటీ లేదా నీట్ కోచింగ్ సెంటర్లలో పనిచేయాల్సి ఉంటుంది. 10 జిల్లాల పరిధిలో ఈ పోస్టులు ఉన్నాయి.
- సంస్థ పేరు : ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ
- పోస్టు పేరు : మెంటార్ / ఫ్యాకల్టీ
- సబ్జెక్టులు : మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ
- పోస్టుల సంఖ్య : 49
- భర్తీ చేసే పద్ధతి : కాంట్రాక్ట్
సబ్జెక్టు | ఖాళీలు |
మ్యాథమెటిక్స్ | 08 |
ఫిజిక్స్ | 14 |
కెమిస్ట్రీ | 16 |
బోటనీ | 06 |
జువాలజీ | 05 |
కోచింగ్ సెంటర్స్ మరియు ఖాళీల వివరాలు:
కోచింగ్ సెంటర్ పేరు | B/G | మ్యాథ్స్ | ఫిజిక్స్ | కెమిస్ట్రీ | బోటనీ | జువాలజీ |
చీపురుపల్లి, విజయనగరం | గర్ల్స్ | 1 | 1 | 2 | 0 | 1 |
శ్రీక్రిష్ణపురం, విశాఖపట్నం | బాయ్స్ | 1 | 2 | 2 | 0 | 0 |
పిఠాపురం, కాకినాడ | గర్ల్స్ | 1 | 2 | 1 | 1 | 1 |
ద్వారకా తిరుమల, ఏలూరు | గర్ల్స్ | 1 | 1 | 2 | 0 | 0 |
కుంటముక్కల, ఎన్టీఆర్ | గర్ల్స్ | 0 | 2 | 1 | 1 | 0 |
అడవితక్కెలపాడు, గుంటూరు | బాయ్స్ | 1 | 0 | 2 | 1 | 1 |
శింగరాయకొండ, ప్రకాశం | గర్ల్స్ | 1 | 2 | 2 | 1 | 1 |
కుప్పం, చిత్తూరు | గర్ల్స్ | 1 | 2 | 2 | 0 | 0 |
బి.పప్పూరు, అనంతపురం | బాయ్స్ | 1 | 2 | 1 | 1 | 1 |
చిన్నటేకురు, కర్నూలు | బాయ్స్ | 0 | 0 | 1 | 1 | 0 |
విద్యార్హతలు :
APSWREIS Faculty Notification 2025 అభ్యర్థులు ఐఐటీ / ఎన్ఐటీ / బిట్స్ / ఐఐఎస్ఈఆర్ / సెంట్రల్ యూనివర్సిటీలో సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం : ఐఐటీజేఈఈ / నీట్ కోచింగ్ లో 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో 5 సంవత్సరాలు కార్యాచరణ కలిగి ఉండాలి.
వయస్సు:
APSWREIS Faculty Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 44 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
APSWREIS Faculty Notification 2025 ఫ్యాకల్టీ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
జనరల్ | రూ.500/- |
బీసీ | రూ.300/- |
ఎస్సీ / ఎస్టీ | రూ.100/- |
ఎంపిక విధానం:
APSWREIS Faculty Notification 2025 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు డెమో క్లాస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఐఐటీ / నీట్ స్టాండర్డ్స్ లో రాత పరీక్ష ఉంటుంది.
- రాత పరీక్ష : 80 మార్కులు
- డెమో క్లాస్ : 20 మార్కులు
- సమయం : 90 నిమిషాలు
- పరీక్ష విధానం : ఓఎమ్ఆర్ ఆధారిత పరీక్ష, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
- మీడియం : ఇంగ్లీష్
జీతం వివరాలు :
APSWREIS Faculty Notification 2025 ఫ్యాకల్టీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పనితీరు మరియు అనుభవం ఆధారంగా జీతం ఇవ్వడం జరుగుతుంద. అనుభవం బట్టి నెలకు రూ.50,000/- నుంచి రూ.1,00,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
APSWREIS Faculty Notification 2025 ఫ్యాకల్టీ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా మే 26వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 26 మే, 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 11 జూన్, 2025 |
రాత పరీక్ష తేదీ | 15 జూన్, 2025 |
హెల్ప్ డెస్క్:
దరఖాస్తు చేసుకోవడంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలు లేదా టెక్నికల్ సమస్యలు ఏర్పడితే అభ్యర్థులు 8978222529 నెంబర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించవచ్చు. మే 26వ తేదీ నుంచి రిక్రూట్మెంట్ నిర్వహణ పూర్తి అయ్యే వరకు హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది.
Notification | Click here |
Official Website | Click here |