BEL Recruitment 2025 ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ (BEL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
BEL Recruitment 2025 Overview :
నియామక సంస్థ పేరు | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) |
పోస్టు పేరు | ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ట్రైనీ ఇంజనీర్ |
పోస్టుల సంఖ్య | 08 |
రిక్రూట్మెంట యూనిట్ | మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ |
జాబ్ లొకేషన్ | మచిలీపట్నం |
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్ నుంచి ఈ ఉద్యోగ ప్రకటన వెలువడింది. ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 08 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) | 06 |
ప్రాజెక్ట్ ఇంజనీర్ (మెకానికల్) | 01 |
ట్రైనీ ఇంజనీర్ (మెకానికల్) | 01 |
అర్హతలు :
BEL Recruitment 2025 ప్రాజెక్ట ఇంజనీర్ మరియు ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో BE / B.Tech / BSc(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
BEL Recruitment 2025 పోస్టులకు జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BEL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్/ఓబీసీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.472/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
BEL Recruitment 2025 పోస్టులకు వాక్ ఇన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ లో కింది దశలు ఉంటాయి.
- రాత పరీక్ష : ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 85 మార్కులకు, ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
- పర్సనల్ ఇంటర్వ్యూ : పర్సనల్ ఇంటర్వ్యూ కేవలం ప్రాజెక్ట్ ఇంజనీర్ లకు మాత్రమే నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ : వాక్ ఇన్ కు హాజరయ్యే అభ్యర్థలందరూ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి.
జీతం వివరాలు :
BEL Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వేతనాలు కింది విధంగా ఉంటాయి.
ప్రాజెక్ట్ ఇంజనీర్ :
- 1వ సంవత్సరం : నెలకు రూ.40,000/-
- 2వ సంవత్సరం : నెలకు రూ.45,000/-
- 3వ సంవత్సరం : నెలకు రూ.50,000/-
- 4వ సంవత్సరం : నెలకు రూ.55,000/-
ట్రైనీ ఇంజనీర్ :
- 1వ సంవత్సరం : నెలకు రూ.30,000/-
- 2వ సంవత్సరం : నెలకు రూ.35,000/-
- 3వ సంవత్సరం : నెలకు రూ.40,000/-
దరఖాస్తు విధానం :
BEL Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ముందుగా గూగుల్ ఫారమ్ లో వివరాలు పూర్తిగా నింపాలి. గూగుల్ ఫారమ్ లింక్ కింద ఇవ్వబడింది.
- గూగుల్ ఫారమ్ సమర్పించిన తర్వాత, రెస్పాన్స్ కాపీ ఈమెయిల్ ఐడీకి పంపించడం జరుగుతుంది. దీనిని ప్రింట్ తీసుకోవాలి.
- ఆన్ లైన్ లో అప్లికేషన్ పీజు చెల్లించాలి.
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలను జాగ్రత్తగా నింపాలి. ఇటీవల పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించాలి.
- జూన్ 29వ తేదీన వాక్ ఇన్ ఎంపికకు హాజరుకావాల్సి ఉంటుంది.
వాక్ ఇన్ సమయంలో కావాల్సిన పత్రాలు :
- గూగుల ఫారమ్ కాపీ
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారమ్
- ఫీజు చెల్లించిన రసీదు
- అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ఒక సెట్ ఫొటో కాపీలు
ముఖ్యమైన తేదీలు :
గూగుల్ ఫారమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం | 13 – 06 – 2025 |
గూగుల్ ఫారమ్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ | 28 – 06 – 2025 |
వాక్ ఇన్ మరియు ఎంపిక | 29 జూన్, 2025 |
Notification | Click here |
Application Form | Click here |
Google Form Registration Link | Click here |
Fee Payment Link | Click here |
Official Website | Click here |