BSI Recruitment 2025 పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్, గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు.
BSI Recruitment 2025
పోస్టుల వివరాలు :
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్, గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ కోసం కంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య : 14
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | 05 |
ఫీల్డ్ అసిస్టెంట్ | 05 |
రీసెర్చ్ అసోసియేట్ | 01 |
గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్ | 02 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ | 01 |
అర్హతలు:
BSI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి. పోస్టుల అర్హతలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | అర్హతలు |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | కనీసం 55 శాతం మార్కులతో బోటనీలో MSc మరియు ప్లాంట్ టాక్సానమీలో అనుభవం, ఫ్లోరిస్టిక్ స్టడీస్, హెర్బేరియం పద్ధతులు, జీఐఎస్, ఏఐ,స్టాటిస్టికల్ అనాలిసిస్ లో నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. |
రీసెర్చ్ అసోసియేట్ | బోటనీ లేదా నాచురల్ సైన్స్ లో పీహెచ్డీ. అండమాన్ అండ్ నికోబార్ ఫ్లోరా, జీఐఎస్, రిమోట్ సెన్సింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్ లో అనుభవం ఉండాలి. |
ఫీల్డ్ అసిస్టెంట్ | 12 తరగతి లేదా బోటనీ సబ్జెక్ట్ తో డిగ్రీ ఉండాలి. ఫీల్డ్ శాంపిల్ కలెక్షన్ లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. |
గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్ | 10వ తరగతి ఉత్తీర్ణత. గార్డెనింగ్ లో 3 సంవత్సరాల అనుభవం |
డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ | కామర్స్ లో గ్రాడ్యుయేషన్ లేదా కంప్యూటర్ లేదా ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో డిప్లొమా ఉండాలి. అకౌంటింగ్, డేటా ఎంట్రీలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. |
వయస్సు:
BSI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి గరిష్ట వయోపరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
- జూనియర్ రీసెర్చ్ ఫెలో : 28 సంవత్సరాలు
- రీసెర్చ్ అసోసియేట్ : 40 సంవత్సరాలు
- ఫీల్డ్ అసిస్టెంట్ : 30 సంవత్సరాలు
- గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్ : 35 సంవత్సరాలు
- డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్: 35 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ:
BSI Recruitment 2025 పోస్టులకు అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతం :
BSI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం నిర్ణయిస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జీతం వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- జూనియర్ రీసెర్చ్ ఫెలో : NET / GATE అర్హత కలిగిన వారికి రూ.31,000 + HRA ఇస్తారు. Non NET అభ్యర్థులకు రూ.25,000/- + HRA
- రీసెర్చ్ అసోసియేట్ : రూ.47,000/- + HRA
- ఫీల్డ్ అసిస్టెంట్ : రూ.18,000/- (కన్సాలిడేటెడ్)
- గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్ : రూ.18,000/- (కన్సాలిడేటెడ్)
- డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్: రూ.30,000/-(కన్సాలిడేటెడ్)
దరఖాస్తు విధానం:
BSI Recruitment 2025 పోస్టులకు అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. లింక్ కింద ఇవ్వబడింది. దాని ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. అప్లికేషన్ ని స్పీడ్ పోస్ట్ ద్వారా కింది ఇచ్చిన అడ్రస్ కి ఏప్రిల్ 30వ తేదీలోపు పంపాలి.
అప్లికేషన్ పంపాల్సిన అడ్రస్:
ఆఫీసర్ ఇన్ ఛార్జ్, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, అండమాన్ అండ్ నికోబార్ రీజనల్ సెంటర్, హడ్డో, పోర్ట్ బ్లెయిర్- 744102
ఈమెయిల్ ద్వారా : స్కాన్ చేసిన అప్లికేషన్ మరియు డాక్యుమెంట్స్ కాపీలను jjayanthi@bsi.gov.in కు పంపాలి.
పనిచేయాల్సిన ప్రదేశం:
BSI Recruitment 2025 అన్ని పోస్టులు కూడా గ్రేట్ నికోబార్ ద్వీపంలో ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు ధనిఖారి బొటానికల్ గార్డెన్ మరియు BSI అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతీయ కేంద్రంలో కూడా పనిచేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తులకు చివరి తేదీ : 30 – 04 – 2025
Notification & Application | CLICK HERE |