ECIL Senior Artisan Recruitment 2025 హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ ట్రేడ్స్ లో సీనియర్ ఆర్టిసన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
ECIL Senior Artisan Recruitment 2025 Overview :
నియామక సంస్థ | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ |
పోస్టు పేరు | సీనియర్ ఆర్టిసన్ |
పోస్టుల సంఖ్య | 125 |
అర్హత | ఐటీఐ |
దరఖాస్తు తేదీలు | 26 జూన్ – జూలై 07, 2025 |
వయోపరిమితి | 30 సంవత్సరాలు |
ఎంపిక ప్రక్రియ | మెరిట్ ఆధారంగా |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
పోస్టుల వివరాలు :
అణుశక్తి పరిధిలోని మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ ఆర్టిసన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రారంభంలో ఒక సంవత్సరం కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ప్రాజెక్ట్ అవసరాలు మరియు పనితీరును బట్టి 4 సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది. ఈ ఉద్యోగాలు కేటగిరీ 1 మరియు కేటగిరీ 2 ట్రేడ్ల కిందకు వస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ ECILలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ట్రేడ్ వారీగా ఖాళీల వివరాలు :
సీనియర్ ఆర్టీసాన్ – కేటగిరీ -1 : 120 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ మెకానిక్ : 50 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ : 30 పోస్టులు
- ఫిట్టర్ : 40 పోస్టులు
సీనియర్ ఆర్టీసాన్ – కేటగిరీ-2 : 05
- ఎలక్ట్రీషియన్ మెకానిక్ : 01
- ఎలక్ట్రీషియన్ : 02
- ఫిట్టర్ : 02
అర్హతలు :
ECIL Senior Artisan Recruitment 2025 సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ (2 సంవత్సరాల పూర్తి సమయం) ఉత్తీర్ణులై ఉండాలి. తయారీ, రిపేరీ, టెస్టింగ్ లేదా ప్రొడక్షన్ లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. అప్రెంటిస్ షిప్ కూడా అనుభవంగా పరిగణించబడుతుంది.
వయస్సు :
ECIL Senior Artisan Recruitment 2025 సీనియర్ ఆర్టీసాన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
ECIL Senior Artisan Recruitment 2025 పోస్టులకు దరఖస్తు చేసుకోవాలనుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
ECIL Senior Artisan Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఉంటుంది.
- మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ : అభ్యర్థులను ఐటీఐ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు :
ECIL Senior Artisan Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.23,368/- జీతం ఇవ్వడం జరుగుతుంది. CLC మార్గదర్శకాల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి జీతం సవరించబడుతుంది.
దరఖాస్తు విధానం :
ECIL Senior Artisan Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- కెరీర్ విభాగంలో ప్రస్తుత జాబ్ వెకెన్సీ పై క్లిక్ చేయాలి.
- తర్వాత అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- వ్యక్తిగత మరియు విద్యార్హత వివరాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అవసరమైన పత్రాలు మరియు ఫొటోగ్రాఫ్ ను అప్ లోడ్ చేయాలి.
- ఆ తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 26 జూన్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 07 జూలై, 2025
Notification | Click here |
Apply Online | Click here |