IB Security Assistant MT Recruitment 2025 : ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్ పోర్ట్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 455 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

IB Security Assistant MT Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇంటెలిజెన్స్ బ్యూరో(IB), హోమ్ మంత్రిత్వ శాఖ |
పోస్టు పేరు | సెక్యూరిటీ అసిస్టెంట్(మోటార్ ట్రాన్స్ పోర్ట్) |
ఖాళీల సంఖ్య | 455 |
జీతం | రూ.21,700 – రూ.69,100/- |
దరఖాస్తు ప్రక్రియ | 6 సెప్టెంబర్ – 28 సెప్టెంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : LIC Golden Jubilee Scholarship Scheme 2025 | 60% మార్కులు ఉంటే ₹40,000 స్కాలర్‌షిప్ మీకే!
ఖాళీల వివరాలు(Vacancy) :
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్ (మోటార్ ట్రాన్స్ పోర్ట్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 455 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- మొత్తం ఖాళీల సంఖ్య : 455
అర్హతలు (IB Security Assistant MT Recruitment Eligibility 2025):
సెక్యూరిటీ అసిస్టెంట్(మోటార్ ట్రాన్స్ పోర్ట్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- అభ్యర్థికి మోటార్ మెకానిజం గురించి నాలెడ్జ్ ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత కనీసం 1 సంవత్సరం మోటార్ కారు డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
- అభ్యర్థి అప్లయ్ చేసుకున్న రాష్ట్రం యొక్క నివాస ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
వయోపరిమితి (Age Limit):
IB Security Assistant MT Recruitment 2025 అభ్యర్థులకు 28.09.2025 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
IB Security Assistant MT Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- UR / OBC / EWS : రూ.650/-
- SC / ST / Women : రూ.550/-
ఎంపిక ప్రక్రియ (Selection Process) :
IB Security Assistant MT Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
టైర్-1 రాత పరీక్ష :
- 100 మార్కులకు ఉంటుంది.
- జనరల్ అవేర్నెస్, డ్రైవింగ్ రూల్స్, రీజనింగ్, ఆప్టిట్యూడ్ మరియు ఇంగ్లీష్ ని కవర్ చేసే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్.
టైర్-2 పరీక్ష:
- 50 మార్కులకు ఉంటుంది.
- డ్రైవింగ్ టెస్ట్ మరియు మోటార్ మెకానిజం టెస్ట్
- ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్:
- ఒరిజనల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు.
మెడికల్ ఎగ్జామ్ :
- ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రమాణాల ప్రకారం మెడికల్ ఫిట్ నెస్ టెస్ట్ నిర్వహిస్తారు.
Also Read : ISRO SAC Recruitment 2025 | స్పేస్ అప్లికేషన్ సెంటర్ లో బంపర్ జాబ్స్
జీతం వివరాలు(Pay Scale) :
IB Security Assistant MT Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ లెవల్-3 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.
- పే స్కేల్ : రూ.21,700 – రూ.69,100/-
దరఖాస్తు విధానం(How to Apply):
IB Security Assistant MT Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు mha.gov.in అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి
- IB Security Assistant MT Recruitment 2025 అప్లయ్ ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు, ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 06 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : AP Grama Sachivalayam Notification 2025 | గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా 2,778 పోస్టులు