IBPS RRB PO Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్ – I, II & III) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 5,245 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IBPS RRB PO Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) |
ఎగ్జామ్ పేరు | CRP RRBs – XIV |
పోస్టు పేరు | గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్ – I, II & III) |
ఖాళీలు | 5,245 |
దరఖాస్తు ప్రక్రియ | 01 సెప్టెంబర్ – 21 సెప్టెంబర్,2025 |
ఎంపిక ప్రక్రియ | ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ |
Also Read : IBPS RRB Office Assistant Recruitment 2025 | గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు (Vacancy Details) :
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్ – I, II & III) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,245 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్కేల్-1(అసిస్టెంట్ మేనేజర్), స్కేల్-2 (మేనేజర్) మరియు స్కేల్-3(సీనియర్ మేనేజర్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 5,245
అర్హతలు మరియు అనుభవం(Eligibility) :
IBPS RRB PO Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతల వివరాలు మారుతాయి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | అర్హతలు | అనుభవం |
ఆఫీసర్ స్కేల్-1 | ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. అగ్రికల్చర్, ఐటీ, మార్కెటింగ్, లా, ఎకనామిక్స్ మొదలైన వాటికి ప్రాధాన్యత. | అవసరం లేదు |
ఆఫీసర్ స్కేల్-2(GBO) | 50% శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, లా, ఐటీ మొదలైన వాటికి ప్రాధాన్యత. | 2 సంవత్సరాలు |
ఆఫీసర్ స్కేల్-2(SO) | సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ (ఐటీ, లా, సీఏ, ట్రెజరీ, మార్కెటింగ్, వ్యవసాయం) | 1-2 సంవత్సరాలు |
ఆఫీసర్ స్కేల్-3 | 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. బ్యాంకింగ్, అగ్రికల్చర్, ఐటీ, మార్కెటింగ్, లా మొదలైన వాటికి ప్రాధాన్యత | 5 సంవత్సరాలు |
వయోపరిమితి (AGE):
IBPS RRB PO Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- ఆఫీసర్ స్కేల్-1 : 18 – 30 సంవత్సరాలు
- ఆఫీసర్ స్కేల్-2 : 21 – 32 సంవత్సరాలు
- ఆఫీసర్ స్కేల్-3 : 21 – 40 సంవత్సరాలు
Also Read : APCOB Recruitment 2025 | ఏపీ Cooperative Bank లో ఉద్యోగాల భర్తీ – Official Notification Out
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
IBPS RRB PO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరి | ఫీజు |
జనరల్ / ఓబీసీ / EWS | రూ.850/- |
SC / ST / PwBD / ExSm | రూ.175/- |
ఎంపిక ప్రక్రియ(Selection Process):
IBPS RRB PO Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
ప్రిలిమినరీ ఎగ్జామ్ :
- 80 మార్కులు
- రీజనింగ్ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
- సమయం : 45 నిమిషాలు
మెయిన్స్ ఎగ్జామ్ :
- స్కేల్-1 పోస్టులకు : రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ / హిందీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (200 మార్కులు)
- స్కేల్-2&3 పోస్టులకు : ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్ / హిందీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (200/240 మార్కులు)
ఇంటర్వ్యూ :
- వెయిటేజీ : ఆన్ లైన్ పరీక్ష 80% + ఇంటర్వ్యూ 20%
జీతం వివరాలు(Salary) :
IBPS RRB PO Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.50,000 నుంచి రూ.55,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం(How to Apply) :
IBPS RRB PO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు https://www.ibps.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- CRP RRBs – XIV లింక్ పై క్లిక్ చేసి, Apply Online Recruitment of Officer Scale-I, II & III Under CRP RRBs – XIV లింక్ పై క్లిక చేయాలి.
- మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి వ్యక్తిగత, విద్యా మరియు కమ్యూనికేషన్ వివరాలు నింపాలి.
- ఫొటో, సంతకం, బొటనవేలు ముద్ర మరియు చేతితో రాసిన డిక్లరేషన్ ను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21 సెప్టెంబర్, 2025
- ప్రిలిమినరీ పరీక్ష : నవంబర్ / డిసెంబర్ 2025
- మెయిన్స్ పరీక్ష : డిసెంబర్ 2025/ ఫిబ్రవరి 2026
- ఇంటర్వ్యూ : జనవరి / ఫిబ్రవరి 2026
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : Oil India Grade A, B & C Recruitment 2025 | ఆయిల్ ఇండియాలో గ్రేడ్ A, B & C ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్