ISRO SAC Recruitment 2025 : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(SAC) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్-1 మరియు ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు( ISRO SAC Recruitment Vacancy 2025)
ఇస్రో, స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(SAC) వివిధ ప్రాజెక్ట్ కేటగిరీల కింద ప్రాజెక్ట్ సైంటిస్ట్-1 మరియు ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ప్రాజెక్ట్ సైంటిస్ట్-1 | 01 |
ప్రాజెక్ట్ అసోసియేట్-1 (జియో-ఇన్ఫర్మేటిక్స్ / RS / GIS / అగ్రికల్చర్ ఐటీ) | 07 |
ప్రాజెక్ట్ అసోసియేట్-1(కంప్యూటర్ సైన్స్ / డేటా సైన్స్) | 01 |
ప్రాజెక్ట్ అసోసియేట్-1 (అగ్రికల్చర్ సైన్స్) | 04 |
మొత్తం | 13 |
Also Read : IIM Visakhapatnam Recruitment 2025 | అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
అర్హతలు (ISRO SAC Recruitment Eligibility Criteria 2025)
పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
ప్రాజెక్ట్ సైంటిస్ట్-1 :
- అగ్రికల్చర్ సైన్స్ లో PhD లేదా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ / అగ్రికల్చర్ ఐటీ లో ME / M.Tech / CGPA 6.5
ప్రాజెక్ట్ అసోసియేట్-1:
- జియో ఇన్ఫర్మేటిక్స్ / రిమోట్ సెన్సింగ్ / GISలో MSc (లేదా) అగ్రికల్చర్ ఐటీ / జియో ఇన్ఫర్మేటిక్స్ / అగ్రి. ఇంజనీరింగ్ లో B.Tech (లేదా) సీఎస్ఈ / డేటా సైన్స్ లో బీటెక్ (లేదా) అగ్రికల్చర్ సైన్సెస్ (ఆగ్రోనమీ, సాయిల్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్) లో MSC
వయోపరిమితి (Age Limit) :
ISRO SAC Recruitment 2025 అభ్యర్థులకు 22.09.2025 నాటికి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fees) :
ISRO SAC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ(ISRO SAC Recruitment Selection Process 2025):
ప్రాజెక్ట్ సైంటిస్ట్ మరియు ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- విద్యా రికార్డుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్ట్
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
- ఫైనల్ మెరిట్ లిస్ట్
Also Read : AP Adult Education Department Notification 2025 | సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు (Salary Details):
ISRO SAC Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ప్రాజెక్ట్ సైంటిస్ట్-1 : రూ.56,000 + HRA
- ప్రాజెక్ట్ సైంటిస్ట్-1 : రూ.31,000 + HRA
దరఖాస్తు విధానం (How to Apply) :
ISRO SAC Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు https://careers.sac.gov.in/ వెబ్ సైట్ ని సందర్శించాలి.
- ISRO SAC Recruitment 2025 Online Apply లింక్ పై క్లిక్ చేయాలి.
- ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ ను సేవ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 02 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 22 సెప్టెంబర్, 2025
- ఇంటర్వ్యూ : అక్టోబర్ – నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : IBPS RRB Office Assistant Recruitment 2025 | గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్