LIC HFL Apprentice Recruitment 2025: లైఫ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC), హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(HFL) అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 192 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ రంగంలో ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ పొందడానికి గ్రాడ్యుయేట్లకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

LIC HFL Apprentice Recruitment 2025 Overview
నియామక సంస్థ | LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ |
పోస్టు పేరు | అప్రెంటిస్ |
ఖాళీల సంఖ్య | 192 |
అర్హత | ఏదైనా డిగ్రీ |
దరఖాస్తు ప్రక్రియ | 2 సెప్టెంబర్ – 22 సెప్టెంబర్, 2025 |
స్టైఫండ్ | రూ.12,000/- |
Also Read : ANGRAU Recruitment 2025 | టీచింగ్ అసోసియేట్ మరియు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
ఖాళీల వివరాలు(Vacancy details) :
LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 192 పోస్టులకు ఖాళీగా ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ కొత్త గ్రాడ్యుయేట్లకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా BFSI రంగంలో ప్రాక్టికల్ ఎక్స్ పోజర్ పొందే అవకాశాన్ని అందిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 192 ఖాళీలు ఉన్నాయి. ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు. అప్రెంటిస్ షిప్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు.
- మొత్తం ఖాళీల సంఖ్య : 192
అర్హతలు(Eligibility) :
LIC HFL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన ఉండాలి. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్ 01.09.2021 మరియు 01.09.2025 మధ్య పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి(Age Limit):
LIC HFL Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 01.09.2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు (Application Fees):
LIC HFL Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ / ఓబీసీ : రూ.944/-
- ఎస్సీ / ఎస్టీ / మహిళలు : రూ.708/-
- పీడబ్ల్యూబీడీ : రూ.472/-
ఎంపిక ప్రక్రియ(Selection Process) :
LIC HFL Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : IB Security Assistant MT Recruitment 2025 | డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్
జీతం వివరాలు(Salary) :
LIC HFL Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి పర్మినెంట్ ఉద్యోగాలు కావు. అప్రెంటిస్ షిప్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు.
- స్టైఫండ్ : నెలకు రూ.12,000/-
దరఖాస్తు విధానం(How to Apply) :
LIC HFL Apprentice Recruitment 2025 అభ్యర్థులు NATS పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు NATS పోర్టల్ ని సందర్శించాలి.
- పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసకొని ఐడీ పొందాలి.
- LIC HFL Apprentice Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపి, సబ్మిట్ చేయండి.
- ఈమెయిల్ ద్వారా పంపబడిన లింక్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 02 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 22 సెప్టెంబర్, 2025
- ప్రవేశ పరీక్ష తేదీ : 01 అక్టోబర్, 2025
- అప్రెంటిస్ షిప్ ప్రారంభ తేదీ : 01 నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : LIC Golden Jubilee Scholarship Scheme 2025 | 60% మార్కులు ఉంటే ₹40,000 స్కాలర్షిప్ మీకే!