BIS Recruitment 2025 | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో రూ.75 వేల జీతంతో ఉద్యోగాలు

By: Afzal

On: April 24, 2025

Follow Us:

BIS Recruitment 2025

BIS Recruitment 2025 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి కన్సల్టెంట్స్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 160 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 19వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కన్సల్టెంట్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 65 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.75,000/- జీతం ఇస్తారు. అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

BIS Recruitment 2025 

పోస్టుల వివరాలు : 

వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత జాతీయ ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి కన్సల్టెంట్స్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. బ్యూరో ఆఫ్ ఇండియా తన స్టాండర్డైజేషన్ కార్యకలపాల కోసం ఈ నోటిఫికేషన్ ప్రకటించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మొత్తం పోస్టుల సంఖ్య : 160

పోస్టు పేరుఖాళీల సంఖ్య
స్టాండర్డైజేషన్ యాక్టివిటీస్ కన్సల్టెంట్160

అర్హతలు : 

BIS Recruitment 2025 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో స్టాండర్డైజేషన్ యాక్టివిటీస్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత రంగంలో B.Tech / BE / వ్యవసాయం శాస్త్రం లేదా సాయిల్ సైన్స్ లో డీగ్రీ / పీజీ / నేచురోపతి మరియు యోగిక్ సైన్సెస్ లో బ్యాచిలర్ డిగ్రీ(BNYS).

వయస్సు: 

BIS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 65 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: 

BIS Recruitment 2025 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

BIS Recruitment 2025 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను వారి విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారిని టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్, ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులను ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తారు. 

జీతం : 

BIS Recruitment 2025 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో కన్సల్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సులు ఉండవు. 

దరఖాస్తు విధానం: 

BIS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • అధికారిక వెబ్ సైట్ లో రిక్రూట్మెంట్ పై క్లిక్ చేయాలి. 
  • అకౌంట్ క్రియేట్ చేసి అవసరమైన సమాచారాన్ని ఫిల్ చేయాలి. 
  • అనంతరం అభ్యర్థులు లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ :  19- 04 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 09 – 04 -2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Gilal Owner & editor at Freejobalertstelugu - with over 5 years of experience covering the Tech & News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment